బ్రేకింగ్ : ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి పై దాడి

కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు… తెలుగులోనూ మంచి నటుడిగా పేరు తెచ్చకున్నారు హీరో విజయ్ సేతుపతి. అయితే.. అలాంటి స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఎయిర్‌ పోర్టు లో ఊహించని షాక్‌ తగిలింది. విజయ్ సేతుపతిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఎయిర్‌ పోర్టు లో దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి… విజయ్‌ సేతుపతి పై విరుచుకుపడ్డాడు ఆ అజ్ఞాత వ్యక్తి.

అయితే.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన బెంగుళూరు ఎయిర్‌ పోర్టు లో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. దాడి చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ని ఎయిర్‌ పోర్టు పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటు ఈ ఘటన పై విజయ్‌ సేతుపతి ఫ్యాన్‌ ఆందోళన గురవుతున్నారు. కాగా.. ఇటీవల తెలుగు లో విడుదల అయిన ఉప్పెన సినిమాతో ఓ రేంజ్‌ కు వెళ్లాడు విజయ్‌ సేతుపతి.