అబుదాబి వేదికగా భారత్ , ఆఫ్ఘనిస్థాన్ టీ ట్వంటి ప్రపంచ కప్ లో భాగంగా మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచు కుంది. అనంతరం టీమిండియా కెప్టెన్ తుది జట్టు ను ప్రకటించారు. తుది జట్టు లో అనూహ్యంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తిసుకున్నారు. అయితగే స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ టీ ట్వంటి జట్టు తో ఉన్న ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో అశ్విన్ ను తుది జట్టు లోకి తీసుకోలేదు.
దీంతో టీమిండియా అభిమానుల నుంచి పలువురు సీనియర్ ఆటగాళ్ల నుంచి మాజీ అటగాళ్ల నుంచి చాలా వరకు విమర్శలు వచ్చాయి. దీంతో అశ్విన్ ను ఆఫ్ఘనిస్థాన్ తో జరగుతున్న మ్యాచ్ లోకి తీసుకున్నారు. అయితే అశ్విన్ కు టీ ట్వంటి లలో మంచి రికార్డు ఉంది. అశ్విన్ ఇప్పటి వరకు 46 టీ ట్వంటి మ్యాచ్ లు ఆడితే అందులో 52 వికెట్లు తీశాడు. అందులో ఒక మ్యాచ్ లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. చివరగా అశ్విన్ తుది జట్టు లో ఉండటం టీమిండియా చాలా వరకు ప్లస్ అని చెప్పవచ్చు.