ఎంతో కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సినీ నటి హేమ సడెన్‌గా తెరపైకి వచ్చి సీఎం జగన్‌ను కలిసింది. తాను రాజకీయాల్లోనే ఉంటానని, సినిమాలు చేయనని చెప్పింది. దీనిపై అభిమానులకు అనేక సందేహాలు కలుగుతున్నాయి.
సినీ నటి హేమ.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చక్కని నటనతో ప్రేక్షకులకు అలరించింది. ముఖ్యంగా నటుడు బ్రహ్మానందంతో ఈమె పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. అయితే ఈమె గతంలో జగన్ సమక్షంలో వైకాపాలో చేరింది. కానీ ఎన్నికల్లో అంత యాక్టివ్‌గా కనిపించలేదు. ఇక ఇవాళే ఈమె సడెన్‌గా మీడియా ముందుకు వచ్చి తాను ఇకపై సినిమాలు చేయనని, రాజకీయాల్లోనే ఉంటానని చెప్పింది. అందులో భాగంగానే హేమ ఈ రోజు జగన్‌ను కూడా కలిసింది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఇంత సడెన్‌గా ఆమె జగన్‌ను కలవడం వెనుక అర్థమేమై ఉంటుందా..? అని ఇప్పుడు జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమై ఉంటుంది.. అని ఒకసారి ఆలోచిస్తే..
గతేడాదిలాగే ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం విదితమే. అయితే ఈసారి మాత్రం ఈ షోను అన్నీ వివాదాలే వెంటాడుతున్నాయి. కాగా గత సీజన్ విన్నర్ అయిన కౌశల్ తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ ద్వారా ఎలా పాపులర్ అయి అందరికన్నా ఎక్కువ ఓట్లను పొందాడో అందరికీ తెలిసిందే. కౌశల్ ఆర్మీ వల్లే కౌశల్ గెలిచాడని కూడా అందరికీ తెలుసు. అందుకనే ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకునేందుకు యత్నిస్తున్నారని తెలుస్తుంది. దాని ద్వారా పెద్ద ఎత్తున నెటిజన్ల ఓట్లను సంపాదించి షోలో విన్ అవ్వవచ్చని వారి ప్లాన్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఫ్యాన్ బేస్‌ను పెంచుకునేందుకు ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారని వినవస్తుంది.
అయితే మరి అసలు హేమ సడెన్‌గా తెరపైకి వచ్చి జగన్‌ను కలవడానికి, బిగ్‌బాస్ 3 షోకు సంబంధం ఏమిటా..? అని ఆలోచిస్తున్నారా..? అక్కడే ఉంది అసలు కిటుకు.. బిగ్‌బాస్ షోలో పాల్గొనేవారికి షో విన్ అవ్వాలంటే వారం వారం ప్రేక్షకుల ఓట్లు కావాలి కదా. వాటిల్లో నెట్ ద్వారా వచ్చే ఓట్లే ఎక్కువగా ఉంటాయి. అందుకనే గత సీజన్‌లో కౌశల్.. కౌశల్ ఆర్మీ పేరిట పెద్ద ఎత్తున ఓట్లను సంపాదించి విజేత అయ్యాడు. అయితే అంత పెద్ద ఎత్తున నెటిజన్ల ఓట్లను సంపాదించడం ఎలా..? అని ఆలోచిస్తే.. అందుకు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి పెయిడ్ ప్రమోషన్. రెండు సహజసిద్ధమైన ప్రమోషన్. పెయిడ్ ప్రమోషన్ అయితే డబ్బులు పెట్టాలి. అదే రెండో తరహా ప్రమోషన్ అయితే సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో ఫాలోయింగ్ ఉన్న పేజీలు, అభిమానులు అయితే చాలు. అదే అభిమానులు, పేజీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నారు. మరి వారి ఓట్లను పొందాలంటే.. ఏం చేయాలి..? అర్థమైంది కదా.. అవును.. అదే.. మీరూహించింది కరెక్టే.. అందుకనే సరిగ్గా హేమ కూడా అలాగే చేసిందని టాక్ వినిపిస్తోంది.
బిగ్‌బాస్ షోలో హేమ పాల్గొనబోతుందని, అందుకనే ఆమె తనకు సోషల్ మీడియా, నెటిజన్ల సపోర్ట్ కోసం వైకాపా అధినేత జగన్‌ను కలిసి ఆ అంశంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆదరణను పొంది, బిగ్‌బాస్ షోలో వారి ఓట్లతో నెగ్గుకురావచ్చని ఆమె ఆలోచిస్తున్నదట. అందుకనే ఆ ప్రక్రియలో తొలి స్టెప్‌గా ఆమె జగన్‌ను కలిసి తానూ వైకాపా కార్యకర్తనే అని గుర్తు చేస్తూ.. తనపై అభిమానం చూపించాలని.. వైకాపా కార్యకర్తలు, అభిమానులకు పరోక్షంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇదంతా బిగ్‌బాస్ షోలో ఓట్ల కోసమేనని మనకు అర్థమవుతుంది. మరి హేమ ఒకవేళ నిజంగానే ఆ షోలో అడుగుపెడితే అప్పుడు వైకాపా అభిమానులు ఆమెకు తాను అనుకున్నట్లుగా ఓట్లు వేసి షో విన్నర్‌ను చేస్తారో, లేదో చూడాలి..!