RAJKOT ODI : రోహిత్ కు జోడీగా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్.. ప్రయోగం ఫలించేనా ?

-

రాజ్ కోట్ లో జరుగుతున్న ఆఖరి వన్ డే లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇండియా ముందు చాలా కష్టమైన టార్గెట్ ను ఉంచింది. అయితే ఇండియా పరిస్థితులు బాగా ఆకళింపు చేసుకున్న రోహిత్ సేన ఓపికగా కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే విజయానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాగా ఈ మ్యాచ్ కు గిల్, గైక్వాడ్, ఇషాన్ కిషన్ లను తప్పించడంతో రోహిత్ శర్మ ఎవరితో కలిసి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేస్తాడో అని అంతా అనుకున్నారు. ఇక కొందరు అయితే విరాట్ కోహ్లీ రోహిత్ లు ఓపెనింగ్ చేస్తారని కూడా భావించారు. కానీ ఇండియా హాట్ యాజమాన్యం మాత్రం ఒక కొత్తగా ప్రయోగాన్ని చేసింది.. చేధించాల్సిన లక్ష్యం పెద్దదిగా ఉండడంతో రోహిత్ శర్మ కు జతగా స్పిన్నర్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను పంపించింది. ఇది నిజంగా చాలా బ్రేవ్ డెసిషన్ అని చెప్పాలి.. అయితే వాషింగ్టన్ సుందర్ చాలా సార్లు దేశవాళీ లీగ్ లలో ఓపెనింగ్ అవతారం ఎత్తి పరుగులు చేసున్నాడు.

ఆ ధైర్యంతోనే ఇండియా యాజమాన్యం సైతం అతన్ని ఓపెనర్ గా పంపింది. మరి ఈ ప్రయోగం ఫలించి.. రోహిత్ కు సుందర్ చక్కగా సహకరిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news