ప్రగ్యా జైశ్వాల్ కు కరోనా నెగిటివ్..

-

అఖండ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కు కరోనా నెగిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు తన క్వారంటైన్‌ ఫోటోలను కూడా షేర్‌ చేసింది ఈ భామ. ” నెగిటివ్‌ అనే పదం ఇప్పటి వరకు తన జీవితం లో ఎప్పుడూ తనను సంతోష పెట్టలేదు” అంటూ ట్వీట్‌ కూడా చేసింది ప్రగ్యా జైస్వాల్‌.

కాగా.. అక్టోబర్‌ 10 వ తేదీన హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా…. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి అయింది. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ సమయంలోనే… హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అయితే.. ఇవాళ కరోనా నుంచి బయటపడింది ఈ భామ.

Read more RELATED
Recommended to you

Latest news