Samantha: విడాకుల త‌రువాత.. ఆ విషయంలో సమంత నెం. 1

-

Samantha: గ‌త నెల రోజులుగా ఇండ‌స్ట్రీలో, ఇటు సోష‌ల్ మీడియాలో సమంత నాగచైతన్య ల విడాకుల ప్రకటన హాట్ ఇష్యూగా మారింది. అక్టోబ‌ర్ 2న. తాము వివాహాబంధానికి పుల్ స్టాప్ పెట్టి.. స్నేహితులుగా ఉందామ‌నుకుంటున్నాం అని సామ్ చైతూల జంట విడిపోతున్న‌ట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.

కానీ , ఈ విష‌యాన్ని ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక పోతున్నారు. అస‌లు కార‌ణం తెలియ‌కపోయే స‌రికి ఎవ్వ‌డికి న‌చ్చింది.. వాడు వాగుతూనే ఉన్నారు. రోజుకో ఓ క‌థ పుట్టిస్తున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును దూరం చేసుకున్న‌ద‌ని అని స‌మంత విమ‌ర్శిస్తుంటే.. బంగారు పంజారం నుంచి విముక్తి ల‌భించ‌ని స‌ర్ధి చేప్పేవారు కొంద‌రూ. ఇన్ని జ‌రుగుతున్న ఇవేమి పట్టించుకోకుండా ఆయ‌న పని ఆయ‌న‌ చూసుకుంటున్నాడు చైతూ. కానీ సామ్ మాత్రం అప్పుడ‌ప్పుడూ.. ప‌రోక్షంగా తన లైఫ్ కి అన్వయించేలా కొటేషన్స్ పెడుతూ యాక్టివ్ గానే ఉంది.

ఇదిలా ఉంటే.. డివోర్స్ త‌రువాత సమంత రేంజ్ పెరిగిందా తగ్గిందా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. స‌మంతకు ముందే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ.. విడాకుల త‌ర్వాత సమంత పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది. గత 5 రోజులుగా ఈమె గురించి అభిమానులు కూడా తెగ వెతికేస్తున్నారు. సమంత గురించి కొత్త విషయాలు తెలుసుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో సమంత సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ త‌రుణంలో ఆమె ఫాలో చేసే వారి సంఖ్య క్ర‌మంగా పెరిగింది. ఇదే విషయం ఆర్మాక్స్ మీడియా నిర్వ‌హించిన సర్వేలో తేలింది. ఈ స‌ర్వేలో గతేడాది టాప్‌లో ఉన్న కాజల్ అగర్వాల్‌ను వెనక్కి నెట్టి స‌మంత అగ్ర స్థానం సొంతం చేసుకుంది. ఏదిమైనా.. విడాకుల తర్వాత సమంత రేంజ్ కొంచెం పెరిగింది అనే చెప్పొచ్చు.

తాజా లిస్టులో సమంత నెం .1 నిలువ‌గా ఆ త‌రువాత స్థానంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, రష్మిక మందన్న, తమన్న భాటియా, కీర్తి సురేష్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, సాయి పల్లవి లు ఉన్నారు. విడాకుల తర్వాత సమంత సోష‌ల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ పెరిగినా… రేంజ్ పెరిగిందా..? తగ్గిందా..? అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news