అమ్మా.. నువ్వు, నీ కొడుకులు బాగా ఉపయోగించుకున్నారు.. సంగీత సంచలన వ్యాఖ్యలు

-

తల్లేమో తన కూతురు తనను ఇంటినుండి వెళ్లగొట్టిందంటూ ఫిర్యాదు చేస్తే.. కూతురేమో తన తల్లి తనపై డబ్బులు సంపాదించుకుంటుందంటుంది. ఏది నిజం.. అసలైమైంది..?

హీరోయిన్‌ సంగీత గుర్తుందిగా.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా నిరూపించుకుంది. ‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే..’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘ఖుషి ఖుషీగా’, ‘సంక్రాంతి’ తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందింది. అయితే ఈ మద్య సంగీత తన తల్లి భానుమతిని ఇంటి నుండి గెంటేసిందంటూ వార్తలు రావడం తెలిసిందే. అటు తిరిగి ఇటు తిరిగి ఆ వార్తలు వ్రాంగ్‌ టర్న్‌ తీసుకుంటున్న తరుణంలో సంగీత ట్టిట్టర్‌ ద్వారా స్పందించింది.

తన తల్లిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక తల్లి ఎలా ఉండకూడదో తనని చూసి తెలుసుకున్నానని, జన్మనిచ్చి ఇంత ఎత్తుకు తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలని తెలిపింది. 13 ఏళ్లకే తనను స్కూల్‌ మాన్పించి, తనపై డబ్బు సంపాదించినందు ధన్యవాదలని తెలిపింది. ఇంకా.. ట్విట్టర్‌లో తన బాధనంతా వెళ్ళగక్కింది. తన 13వ ఏటనే స్కూల్‌ మాన్పించి, తనను డబ్బుల కోసం పనికి పంపినందుకు ధన్యవాదాలు.. డబ్బు కోసం ఆశపడి తనతో బ్లాంక్‌ చెక్కులపై సంతకాలు చేయించున్నందుకు, నువ్వు, నీ తాగుబోతు కొడుకులు నన్ను బాగా ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు.. అంటూ వివరించింది.



పెళ్లి వయసు వచ్చినా పెళ్లిచేయలేదు. తన భర్తను మానసికంగా వేధిస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలు. మొత్తానికి నీ వేధింపుల వల్లే నేను పరిణితి చెందాను.. ధైర్యవంతురాలైన మహిళగా మారాను. అందుకు థాంక్స్ అంటూ సంగీత తన తల్లి భానుమతిపై విరుచుకుపడింది.

అసలు విషయం ఏంటంటే

కొన్ని రోజుల క్రితం సంగీత తల్లి భానుమతి తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో ఫిర్యాదు చేసింది. తన కూతురు సంగీత తనను ఇంటినుండి భయటకు వెళ్లగొట్టిందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. వృద్దురాలినైన తనని సంగీత ఇంట్లో నుంచి గెంటేసిందని, తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లు కూడా భానుమతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సంగీత కుటుంబ వ్యవహారం తెలిసింది. దీనిపై సంగీత ఇన్నాళ్లూ స్పందించలేదు. తన తల్లిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఇలా ట్విట్టర్‌లో స్పందిచింది సంగీత.

సంగీత వైవాహిక జీవితం..

నటిగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2009లో నటుడు, సింగర్‌ అయిన క్రిష్ ని వివాహం చేసుకుంది. సంగీత దంపతులకు ఒక కూతురు. పెళ్లి తరువాత సినిమాలు బాగా తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news