అల్లు అర్జున్ లుక్ అదిరింది.. త్రివిక్రం సినిమా స్టార్ట్..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఈ ఇద్దరు కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఈరోజు ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆల్రెడీ త్రివిక్రం డైరక్షన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను చేసిన బన్ని ముచ్చటగా మూడవ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ స్టోరీతో వస్తుందని తెలుస్తుంది.

సినిమాలో బన్నికి జోడీగా పూజా హెగ్దెని ఫిక్స్ చేశారు. డిజేలో అల్లు అర్జున్ తో జోడీ కట్టిన పూజా మరోసారి అతనితో రొమాన్స్ చేస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం చేసిన అరవింద సమేత సినిమాలో కూడా పూజా హీరోయిన్ గా నటించింది. మొత్తానికి కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న అల్లు అర్జ్ 19వ సినిమా ఈరోజు ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 24 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలుపెడతారట. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news