ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్..?

198

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఉంటాడని తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ సరిపోదు అన్నట్టు ఆర్.ఆర్.ఆర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను తీసుకుంటున్నాడట జక్కన్న. ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్.. ఈజ్ ఇట్ పాజిబుల్ అనుకోవచ్చు.

ముందు ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ చిన్న కెమియో రోల్ చేస్తాడని అన్నారు కాని లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ లో ప్రభాస్ కనిపించడు కాని వినిపిస్తాడని అంటున్నారు. అదేంటి అంటే ఆర్.ఆర్.ఆర్ కోసం ప్రభాస్ తన వాయిస్ ఓవర్ ఇస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ సినిమాలో అక్కడక్కడ అవసరమైన సందర్భాల్లో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుందట. రియల్ హీరోస్ అయిన కొమరం భీం, అల్లూరి పాత్రల్లో ఎన్.టి.ఆర్, చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సూపర్ స్టార్ తో ఆర్.ఆర్.ఆర్ అదిరిపోతుందని అనుకుంటుంటే ప్రభాస్ వాయిస్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020 జూలై 31న రిలీజ్ ఫిక్స్ చేశారు.