పోలీసులపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రశంసిస్తుంటాయి. కరోనా సమయంలో వారు చేసిన సేవలు వర్ణణాతీతం. ఏపీలో లా అండ్ ఆర్డర్ పద్దతిగా నడుస్తుందంటే దానికి కారణం ఏపీ పోలీసులు. పగలన రాత్రనక ప్రజలకోసం పాటుపడే వ్యవస్థ పోలీసు వ్యవస్థ. సమాజంపట్ల అత్యంత ఎక్కువ బాధ్యతగా నడుచుకునే వ్యవస్థ పోలీసులు వ్యవస్థ! అలాంటి పోలీసులపై నోరుజారారు ఆర్.ఆర్.ఆర్.!
అవును… తెగించినోడికి తెడ్డే లింగం అన్న చందంగా ఉంది ఆర్.ఆర్.ఆర్. పద్దతి! ఇంతకాలం తనకు బందోబస్తు కల్పించింది ఏపీ పోలీసులు.. తనకు సమస్య వస్తే కంప్లైట్ చేసింది ఏపీ పోలీసులకు.. తనకు ఇబ్బంది వస్తే ఫిర్యాదు చేసేది ఏపీ పోలీసులకు.. కానీ ఏపీలో పోలీసులకు చట్టాలపై అవగాహన లేదనే స్థాయి మాటలు మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు ఆర్.ఆర్.ఆర్.!
విశ్వాసం, కృతజ్ఞత, విలువలు లేని కొంతమంది నాయకులు వారి పనికిమాలిన రాజకీయాలకోసం మధ్యలో పోలీసులను బలిచేస్తున్న సంగతులు తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పోలీసులకు చట్టాలపై అవగాహన లేదు అనేస్థాయికి తెగించేసి ప్రజా ప్రథినిదులు అనబడేవారు మాటలు మాట్లాడుతున్నారు! ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని.. కాస్త మజ్జిగ తాగి.. అనంతరం ఏపీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమో.. క్షమాపణ చెప్పడమో చేయాలని ఏపీ పోలీసుల అభిమాన ప్రజలు కోరుకుంటున్నారు!!
-CH Raja