టమాటాలకి బదులుగా కూరల్లో వీటిని వెయ్యండి.. రుచి కూడా తగ్గదు..!

-

టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో టమాటాలు కొనడం కష్టం అవుతోంది. చాలామంది టమాటా లేకుండా కూర ఎలా చేసుకోవాలా అని బాధపడుతున్నారు. అయితే అంత ధర పెట్టి టమాటాలని కొనే బదులు సులభంగా మీరు టమాటాలకి బదులుగా వీటిని ఉపయోగించవచ్చు. కూర కూడా బాగానే ఉంటుంది అందులో డౌట్ లేదు.

ఎర్ర క్యాప్సికం:

ఎర్ర క్యాప్సికం ని మీరు టమాటాలకి బదులుగా వాడొచ్చు. సాండ్విచ్ సలాడ్ వంటి వాటిలో మీరు టమాటాలకి బదులుగా ఎర్ర క్యాప్సికం ఉపయోగించవచ్చు. ఎర్ర క్యాప్సికం లని టమాటా లాగ పేస్ట్ చేసి కొంచెం షుగర్ కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి మీరు టమాటాలని ఉపయోగించుకోవచ్చు.

పెరుగు:

పెరుగుని కూడా మీరు టమాటా లాగ ప్యూరీ కింద వాడుకోవచ్చు. పెరుగుని మీరు కూరల్లో వేస్తే టమాటాలు వేయడం వలన గ్రేవీ చిక్కగా వచ్చినట్లు పెరుగు వలన కూడా చిక్కగా గ్రేవీ వస్తుంది కాబట్టి మీరు టమాటాలు లేకుండానే ఇలా వండుకోవచ్చు.

టమాటా కెచప్:

టమాటా రుచి లాగ మీకు మంచి ఫ్లేవర్ కావాలంటే మీరు కూర అంతా చేసుకుని టమాటా ప్యూరీకి బదులుగా కెచప్ ని కొంచెం వేసుకోండి.

గుమ్మడికాయ:

మీరు టమాటా కి బదులుగా ఆ ఫ్లేవర్ కోసం గుమ్మడికాయని ఉపయోగించవచ్చు గుమ్మడికాయని ఉపయోగిస్తే స్వీట్ గా ఉంటుంది. అలానే టెక్స్చర్ ఉంటుంది.

చింతపండు:

చింతపండు గుజ్జు మీరు టమాటాలకి బదులుగా వేస్తే ఆ పుల్లటి రుచి వస్తుంది. పుల్లటి రుచి కోసం పచ్చి మామిడి కూడా బాగానే ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇలా టమాటాలకి బదులుగా వీటిని ఉపయోగిస్తే రుచి కూడా బాగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news