Aditi Rao Hydari : మెస్మరైజింగ్ బ్యూటీతో మాయ చేస్తున్న అదితీ రావు హైదరీ

-

అదితీ రావు హైదరీ తన లేటెస్ట్ ఫొటోషూట్​తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో కుందనపు బొమ్మలా కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. గ్రీన్ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించి మెస్మరైజ్ చేసింది. తన క్యూట్ లుక్స్​తో.. ఎవర్ గ్రీన్ స్మైల్​తో మరోసారి మాయ చేసింది. ప్రస్తుతం అదితీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అదితీ ఫొటోలు చూసి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఈ భామ అందం చూసి తమ గుండె జారి గల్లంతయిందంటూ పాటలు పాడుకుంటున్నారు. హార్ట్ ఎమోజీస్​ పోస్టు చేస్తూ తమ ప్రేమను కురిపించేస్తున్నారు. ఇంతందం దారి మళ్లిందా అని పాటలు పాడుతూ కామెంట్లు చేస్తున్నారు.

అదితీ రావు హైదరీ సమ్మోహనం సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వీ, మహాసముద్రం, హే సినామిక సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్​పైనే తన ఫోకస్ అంతా పెట్టింది. అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్​లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news