RCB తో మ్యాచ్ లో CSK ప్లేయర్ రహానే చేసిన అద్భుతమైన ఫీల్డింగ్ హైలెట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్ లో జడేజా వేసిన బంతిని మాక్స్ వెల్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడరు. సిక్స్ కాయమనుకున్న దశలో రహానే గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నారు. అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంతో బంతిని గ్రౌండ్ లోకి విసిరి ఐదు రన్స్ సేవ్ చేశారు. కాగా, అంతకుముందు బ్యాటింగ్ లో 20 బంతుల్లోనే 2 సిక్సులు, 3 ఫోర్లతో 37 రన్స్ చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చిన అతడు ఒక వికెట్ మాత్రమే తీసి ఆర్సిబి తరపున అత్యంత చెత్త స్పెల్ చేసిన రెండో బౌలర్ గా నిలిచాడు. గతేడాది పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి బౌలర్ జోష్ హేజిల్ వుడ్ 4 ఓవర్లలో 64 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇప్పటికీ అదే ఆర్సిబి తరపున చెత్త స్పెల్ గా ఉంది.
In the midst of one of the worst fielding efforts by a team in the IPL, Rahane pulled out this gem!
Saved five crucial runs! And a very handy contribution with the bat to go along with it! 👏pic.twitter.com/cn0iqmzCwW
— ; (@AIH183no) April 18, 2023