కారు-కాంగ్రెస్ పొత్తు..రాహుల్ తేల్చారు..కానీ అక్కడే డౌట్!

-

చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలోని బి‌జే‌పిపై పోరాటం చేస్తున్న కే‌సి‌ఆర్..దేశంలోని విపక్షాలని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన, కాంగ్రెస్ పార్టీకి కూడా దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ పొత్తు ఉంటుందని చర్చ వస్తుంది. అదే అంశాన్ని బి‌జే‌పి ఆయుధంగా వాడుకుని తెలంగాణలో రాజకీయం చేస్తుంది.

దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు పొత్తు ఉండదని కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం పొత్తు ఉండదని చెప్పారు. తాజాగా కూడా కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేసి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన రాహుల్ గాంధీని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మాణిక్ థాక్రే కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో అరగంట పాటు చర్చించారు.

 

 

అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్న ఆయన బిజెపి చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉందనే అంశాన్ని బిజెపి ప్రజా క్షేత్రంలో ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నాన్ని ఇంకా తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు.

ఇక కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని, తెలంగాణ పై ఫోకస్ చేస్తానని టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండకపోవచ్చు గాని..ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్, కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news