పవన్ తోనే ‘ఫ్యాన్’కు ప్లస్..మళ్ళీ రిపీట్ అవుతుందా?

-

ఓ వైపు పవన్ కళ్యాణ్…వైసీపీపై పోరాటం చేస్తున్నారు…ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని పవన్ చూస్తున్నారు. అవసరమైతే ఓట్లు చీలకుండా ఉండటానికి పొత్తుకు కూడా రెడీ అని పవన్ చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్నారు. మరి అలాంటప్పుడు పవన్ వల్ల వైసీపీకి ప్లస్ ఎలా అవుతుందని అనుకోవచ్చు…నిజమే పవన్ గాని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే పవన్ ఒంటరిగా పోటీ చేయడం…లేదా బీజేపీతో కలిసి పోటీ చేసిన సరే వైసీపీకే ప్లస్.

అయితే అలా జరుగుతుందా? అనేది ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ..ఎందుకంటే నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి రావడం అంతఈజీ కాదు. గత ఎన్నికల మాదిరిగా సులువుగా గెలవలేదు. ఇప్ప్పటికే టీడీపీ పుంజుకుంటుంది…పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. అలా అని అందరు జగన్ ఇమేజ్ ని నమ్ముకుంటే కష్టం. సొంత ఇమేజ్ లేకుండా ముందుకెళితే వైసీపీ ఎమ్మెల్యేలకు గెలిచే అవకాశాలు తక్కువ.

కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ గాని టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణాలో జనసేనకు బలం ఎక్కువ ఉంది. ఆ పార్టీ  గాని టీడీపీతో కలిస్తే ఈ మూడు జిల్లాల్లో వైసీపీకి నష్టం..అదే టీడీపీతో కలవకపోతే వైసీపీకి బెనిఫిట్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు.గత ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలవకపోవడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది…ఆ మూడు జిల్లాల్లో మొత్తం 50 సీట్లు ఉండగా, వైసీపీ 41 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 8 సీట్లు, జనసేన ఒక సీటు గెలుచుకుంది. అంటే వైసీపీ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. అదే అప్పుడే టీడీపీ-జనసేన కలిసి ఉంటే వైసీపీకి ఇన్ని సీట్లు వచ్చాయి కాదు..కాబట్టి నెక్స్ట్ పవన్ -టీడీపీతో కలవకుండా ఉంటేనే వైసీపీకి ప్లస్…లేదంటే మైనస్సే.

Read more RELATED
Recommended to you

Latest news