ఆదివాసులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదని, 75 ఏళ్లుగా కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నెహ్రు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే ఆదివాసిల కోసం ఎన్నో చట్టాలను తెచ్చారన్నారు. నాగార్జున సాగర్ లో గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ నాయకులకు రాజకీయ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. గిరిజన హక్కుల పరిరక్షణ యాక్ట్, పీసా యాక్ట్, అటవీ హక్కుల యాక్ట్ ఇలా ఎన్నో చట్టాలను ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు.
మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య , రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ని చేర్చడం జరిగిందని తెలిపారు. అది ఒక్కటే కాదు.. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆర్టికల్ 244 వంటి ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. దళితులకు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు.