క్రికెట్ సంచలనం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నయా రికార్డ్ నెలకొల్పాడు. ఆఫ్ఘన్ క్రికెట్ లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా మహ్మద్ షాజాద్ రికార్డ్ నెలకొల్పాడు. ఆదివారం నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ లో షాజాద్ ఈ ఫీట్ సాధించాడు. రైట్ హ్యండ్ బ్యాటర్ అయిన షాజాద్ నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. షాజాద్ ఇప్పుడు టీ 20 ఇంటర్నేషనల్ 68 మ్యాచ్‌లలో 12 అర్ధసెంచరీలు మరియు ఒక సెంచరీతో 2011 పరుగులు చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 91 మ్యాచ్‌లలో 3216 పరుగులతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు జట్టు మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సంచలన ప్రకటన చేశాడు. నమీబియాతో మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. దీంతో అస్గర్ అఫ్గాన్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని అఫ్గాన్ ఆటగాళ్లు భావిస్తున్నారు.