T 20 world cup : నమీబియా పై ఆఫ్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ

-

టి20 ప్రపంచ కప్ పోరులో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ లో నమీబియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో నమీబియా జట్టుపై.. అవలీలగా విజయం సాధించింది ఇది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. నమీబియా జట్టుపై ఏకంగా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఏకంగా 160 పరుగుల టార్గెట్ ను నమ్మిన జట్టు ముందు ఉంచింది.

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రాణించగా డంతో 160 పరుగుల భారీ లక్ష్యాన్ని నమీబియా ముందు ఉంచ గలిగింది. అయితే 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నమీబియా జట్టు ఆరంభం నుంచి.. తడబడుతూనే వచ్చింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఏకంగా 9 వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేసింది నమీబియా జట్టు. దీంతో… 62 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఓటమి చవిచూసింది నమీబియా. నమీబియా జట్టు బౌలర్ లు మరియు బ్యాట్స్మెన్లు రెండు విభాగాలు విఫలం కావడంతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news