స్ట్రీట్‌ ఫుడ్స్‌ అమ్ముకుంటున్న టీవీ యాంకర్‌.. ఇంకెన్నాళ్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ దారుణాలు..

-

లైఫ్‌లో కొన్ని ఘటనలు జీవితాన్నే మార్చేస్తాయి.. అప్పటివరుకూ అంతా ప్రశాంతంగా సాగుతున్న క్రమంలో..పెను తుఫాన్‌లా వచ్చి మొత్తం మారిపోతుంది. కరోనాతోనే చాలామంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.. అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల వల్ల..అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక ఫోటో వైరల్‌ అవుతుంది. గతంలో న్యూస్ యాంకర్‌గా పనిచేసిన మొహమ్మదీ ఆర్థిక సంక్షోభం కారణంగా స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్నారు. యాంకర్, రిపోర్టర్‌గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం సమోసాలు అమ్ముకుంటున్నాడు.

మూసా మొహమ్మదీ అనే అఫ్ఘన్ జర్నలిస్ట్ ఫోటో ఇంటర్నెట్‌లో నేడు వైరల్ అవుతోంది. కొన్నాళ్లుగా మీడియా రంగంలో ఉన్న ఆయన ఇప్పుడు వీధిలో ఆహారాన్ని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అంతర్జాతీయ సహాయాన్ని కోల్పోవడం, పెరుగుతున్న వ్యయాలు, అధిక నిరుద్యోగిత రేటు ప్రపంచ బ్యాంకు ‘భయంకరమైన’ పరిస్థితికి దారితీసింది.

అయోబీ ఆఫ్ఘన్ జర్నలిస్ట్ మూసా మొహమ్మదీ ఫోటోను షేర్ చేశారు. కొన్నాళ్లుగా మీడియా రంగంలో భాగమైన ఆయన ఇప్పుడు వీధి ఆహారాన్ని అమ్ముతున్నారు.“జర్నలిస్ట్‌గా జీవితకాలం పని, పోరాటాలు చేసిన ప్రతిభావంతులైన యువతరం భవిష్యత్ ఇలా ముగుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కబీర్ హక్మల్, ఆఫ్ఘనిస్తాన్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి కూడా మొహమ్మదీ గురించి ట్వీట్ చేశారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు తాలిబాన్‌లను నిందించారు. ఈ ఘటన రేడియో టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. తన డిపార్ట్‌మెంట్‌లో టీవీ యాంకర్, రిపోర్టర్‌ను నియమిస్తానని వాసిక్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.

గత ఆగస్టులో తాలిబాన్ అఘ్షనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పటీ నుంచి ఆ దేశంం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాలిబాన్ దళాలు మీడియా సంస్థలపై విరుచుకుపడ్డాయి. గత కొన్ని నెలలుగా అనేక మంది జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.. ప్రపంచ బ్యాంకు ప్రకారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 2022లో మరింత క్షీణిస్తుందని అంచనా. 2020 -2022 ముగింపు మధ్య తలసరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 30 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news