నిజానికి లవ్ ట్రాక్ అనేది ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా సాగుతుందని చెప్పడానికి ఎన్నో జంటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోని సీరియల్ నటుల మధ్య ప్రేమాయణం కూడా నిజం కాకపోయినా వారిద్దరూ కలిసి తిరిగినా చాలు వారిద్దరి మధ్య ప్రేమ ఉందని సృష్టిస్తూ ఉంటారు. అంతేకాదు పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్స్ కూడా తెగ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇక తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ జోడిగా పేరు సొంతం చేసుకున్న రవి కృష్ణ , నవ్య స్వామి జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా ప్రేమ కహానీతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ జంట.. తర్వాత స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ అనే సీరియల్ లో కూడా కలిసి నటించారు ఇకపోతే ఈ సీరియల్ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు షికారులు అయ్యాయి.. అంతేకాదు పలు ఈవెంట్లలో కూడా వీళ్ళిద్దరూ కలసి పాల్గొనడం అక్కడక్కడ రొమాన్స్ చేస్తున్నట్టు కనిపించడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్న నేపథ్యంలో వీటిని కొట్టి పడేసింది నవ్య స్వామి.
కానీ ఇటీవల ఒక టీవీ ఛానల్ లో ప్రసారమైన లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రోగ్రాంలో నవ్య స్వామి తన ప్రేమ విషయాన్ని చెప్పేసింది. ఇకపోతే ప్రోగ్రాంలో భాగంగా ఇద్దరు కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇవ్వగా ఆ తర్వాత చాలా క్యూట్ గా రవి కృష్ణకు ప్రపోజ్ చేసింది. చేతిలో ఎర్ర గులాబీ తో తన మనసులో మాటను తెలిపింది. ఇకపోతే యాంకర్ ప్రదీప్ .. చాలా విషయాలు నాకు తెలిసినవి ప్రేక్షకులకు తెలుసా లేదా అనే డౌట్ ఉందని అనగా.. నువ్వు వచ్చాక నేను వ్యక్తిగతంగా చాలా మారాను.. నువ్వే నా ప్రపంచం.. నీకు ఒక మాట చెప్పాలి అని.. చేతిలో గులాబీ పట్టుకొని ఐ లవ్ యు రవి అని చెప్పేసింది.
రవి సంతోషంగా తన చేతిలోని గులాబీ పువ్వు ని తీసుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ మూమెంట్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది అని చెప్పాలి. మొత్తానికైతే ఒక లవ్ కథ సుఖాంతం అని చెప్పవచ్చు.