దాదాపు 11 ఏళ్ల తర్వాత మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలు!

-

రాష్ట్రంలో దాదాపు 11 ఏళ్ల తర్వాత మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు పూర్తి అయ్యాయి. 2013లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒకే దగ్గర పనిచేస్తున్న వారంతా శనివారం కొత్త ప్రదేశాల్లో పోస్టింగులు తీసుకున్నారు. తమకు బదిలీలు నిర్వహించాలని టీచర్లు ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2023లో బదిలీలు చేపట్టినా హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది.

సీనియారిటీ ఆధారంగా బదిలీల పాయింట్లు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో విద్యాశాఖ గత రెండ్రోజుల్లోనే ఆ ప్రక్రియను కాస్త పూర్తి చేసింది. గత ప్రభుత్వానికి మోడల్ స్కూల్ టీచర్లు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. బదిలీలు లేని కారణంగా దంపతులు తలో జిల్లాకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు బదిలీలు కావడంతో టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news