ఏపీ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు ముగియడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయింది. అయితే రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలోని కృష్ణ- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ఓటరు నమోదుకు సంబంధించి అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అందుకోసం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రొవిజినల్, ఆధార్, ఓటర్ ఐడీని పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.