ఇంగ్లాండ్ కీలక ప్లేయర్ జో రూట్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు వచ్చె ఏడాది ఐపీఎల్ ఆడట్లేదని తెలిపారు. “మేము అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాం. రూట్ అనుభవం గతేడాది జట్టుకు బాగా ఉపయోగపడింది.

అతడి కెరీర్ బాగా కొనసాగాలని కోరుకుంటున్నా” అని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ సంగక్కర తెలిపారు. రూట్ ను గతేడాది రూ. కోటి బేస్ ప్రైస్ కి RR తీసుకున్న విషయం తెలిసిందే. అటు ఐపీఎల్ సీజన్ 2024 కు ఇంగ్లాండ్ కు చెందిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండడం లేదని ప్రకటించింది. స్టోక్స్ కు ఉన్న వర్క్ లోడ్ మరియు ఫిట్నెస్ కారణాల రీత్యా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.