బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. టీ-హబ్‌లో నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ సమావేశం ఐన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మంత్రి కేటీఆర్ పై ఈసీ సీరియస్ అయింది.
దింతో ఇవాళ సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దింతో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ ముందుకు ఇవాళ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కాగా, ఎన్ని సమస్యలు కేంద్రం నుండి కలిగించినా ఆఖరికి మా తల తెగి పడినా ఢిల్లీ కి తలవంచే సమస్యే లేదంటూ కేటీఆర్ చాలా ధీమాగా చెప్పారు. మేము అధికారంలో ఉండగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చాము , వాటిలో లక్షకు పైగా జేబులను అందించినట్లు కేటీఆర్ చెప్పారు.