యూరో క‌ప్ ఫైన‌ల్‌.. ఇట‌లీ గెలుపును జీర్ణించుకోలేని ఇంగ్లండ్ ఫ్యాన్స్‌.. విధ్వంసం సృష్టించారు..!

-

వెంబ్లీ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన యూరో 2020 ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌పై ఇట‌లీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే. రెండు జ‌ట్లు స‌మాన గోల్స్‌ను చేసినా పెనాల్టీల ప‌రంగా ఇట‌లీ పైచేయి సాధించింది. దీంతో ఇటలీని విజ‌యం వ‌రించింది. అయితే ఇట‌లీ గెలుపును జీర్ణించుకోలేని ఇంగ్లండ్ ఫ్యాన్స్ స్టేడియం బ‌య‌ట విధ్వంసం సృష్టించారు.

after euro cup loss england fans attacked italy fans

మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓట‌మి ఖాయం అవ‌గానే స్టేడియం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ దేశం అభిమానులు ఆగ్ర‌హ జ్వాల‌లతో చెల‌రేగిపోయారు. ఇట‌లీ ఫ్యాన్స్‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఆ దేశ జాతీయ జెండాను చించేశారు. ఇట‌లీ ఫ్యాన్స్‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో నెటిజ‌న్లు కూడా ఇంగ్లండ్ ఫ్యాన్స్‌పై మండిప‌డుతున్నారు.

ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కు బుద్ధి లేద‌ని, వారు ఎప్పుడూ జాత్యంహ‌కారంతో ర‌గిలిపోతుంటార‌ని, ఇత‌ర దేశాలు గెలిస్తే జీర్ణించుకోలేర‌ని, క‌నుక ఫిఫా ఈ విష‌యంలో జోక్యం చేసుకుని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఫుట్ బాల్ మ్యాచ్‌ల‌ను సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణంలో ఫ్యాన్స్ వీక్షించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. నెటిజ‌న్లు కోరుతున్నారు.

కాగా మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ గోల్ చేసింది. 2వ నిమిషం వ‌ద్ద ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ లూక్ షా గోల్ కొట్టాడు. అయితే 67వ నిమిషంలో ఇట‌లీకి చెందిన లియోనార్డో బొనుక్కి గోల్ చేశాడు. దీంతో రెండు జ‌ట్ల స్కోర్లు స‌మ‌యం అయ్యాయి. అయితే పెనాల్టీల్లో ఇట‌లీ పైచేయి సాధించింది. ఆ జ‌ట్టుకు 3 పెనాల్టీలు ద‌క్క‌గా ఇంగ్లండ్ 2 మాత్ర‌మే సాధించింది. దీంతో ఇటలీ గెలుపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news