నగర వాసులకు హైదరాబాద్ మెట్రో చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్ లో పడకుండా త్వరగా ఇళ్ళకు, గమ్యస్థానాలకు చేరుకుంటామని భావించి ఎక్కుతున్న వారి కొంప ముంచుతోంది. ఎప్పుడూ ఏదో ఒక సాంకేతిక కారణంతో మెట్రో ఆగిపోతూ ఉండడం మెట్రో ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. తాజాగా హైదరాబాద్ మెట్రోలో మరో సారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్ పేట నుండి జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ వెళ్ళాల్సిన మెట్రోరైలు మధ్యలో నిలిచి పోయింది.
పది హేను నిమిషాలుగా మెట్రో సేవలు నిలిచిపోయినట్టు చెబుతున్నారు. హైటెక్ సిటీ నుండి జూబ్లీహిల్స్ వరకు వచ్చిన ట్రైన్ లో ప్యాసింజర్లను స్టేషన్లో దింపేసి ముందు ట్రైను తీసుకెళ్లేందుకు ఖాళీ ట్రైన్ పంపిస్తున్నారు అధికారులు. ప్రతి సారి ఇలా జరగడం బాలేదని అంటున్నారు ప్రయాణికులు. ఇలా జరుగుతూ ఉంటే మెట్రో అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.