మళ్లీ ‘పెట్రో’ బాదుడు!

-

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు, అలాగే నిత్యావసర సరుకుల ధరలు దీనివల్ల ఖర్చులు కూడా పెరిగాయి. ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు మళ్లీ చమురు రంగ కంపెనీలు అమాంతం ధరలను పెంచేశాయి. అదేమంటే అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచినట్లు చెబుతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రోజూ ఈ బాదుడు ఉంటుంది. పెరిగిన పెట్రోల్‌ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కి రూ.0.17 పైసలు పెరిగి, రూ.94.16కి చేరింది. డీజిల్‌ ధర లీటర్‌ రూ.0.20 పెరిగి… రూ.88.25 అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి.

petrol-diesel
petrol-diesel

 

ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.0.15 పైసలు పెరిగి, రూ.90.55. డీజిల్‌ లీటర్‌ రూ.0.18 పెరిగి, రూ.80.91కి చేరింది. ముంబైలో లీటర్‌కు రూ.0.12 పెరిగి రూ.96.95కి చేరింది. డీజిల్‌ ధర లీటర్‌ రూ.0.17 పెరిగి… రూ.87.98కి చేరింది.

బెంగళూరులో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.0.24 పెరిగి… రూ.93.67కి చేరింది. డీజిల్‌ రూ.0.27 పెరిగి, రూ.85.87కి చేరింది. చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ రూ.0.12 పెరిగి, రూ.92.55కి పెరిగింది. డీజిల్‌ లీటర్‌ రూ.0.15 పెరిగి, రూ.85.90కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.0.14 పెరిగి రూ.90.76కి చేరగా, డీజిల్‌ లీటర్‌ రూ.0.17 పెరిగి, రూ.83.78కి చేరింది. కొన్నాళ్లుగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, బలవంతంగా ధరలను స్థిరంగా ఉంచారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news