కాసేపటి క్రితం ఏపీ కేబినేట్ సమావేశం జరిగింది. వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధానికి లేఖ రాస్తారని మంత్రి పేర్ని నానీ ప్రకటించారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్‍లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు చర్యలు చేపట్టాలని, రేపటి నుంచి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆర్టీసీ బస్సులను, ఆటోలను కూడా మధ్యాహ్నం 12 తర్వాత నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులను కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.