బీసీలకు జగన్ మార్కు గుడ్ న్యూస్ ఇది!

-

జగన్ సర్కార్ బీసీల అభివృద్ధి విషయంలో మరో భారీ ముందడుగు వేసింది. ఇటీవలే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం… తాజాగా 56 కార్పొరేషన్లకు పాలకమండళ్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కో కార్పొరేషన్ కు.. చైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది! ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

jagan
జిల్లాలవారీగా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు – డైరెక్టర్ల లిస్ట్ ఇదే:

శ్రీకాకుళం:

కళింగ: పేరాడ తిలక్
కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు
రెడ్డిక: లోకేశ్వరరావు
పోలినాటి వెలమ: కృష్ణవేణి
కురకుల/పొండర: రాజపు హైమావతి
శ్రీసైన: చీపురు రాణి

విజయనగరం:

తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్
కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు
శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్
దాసరి: రంగుముద్రి రమాదేవి

విశాఖ:

మత్స్యకార: కోలా గురువులు
గవర: బొడ్డేడ ప్రసాద్
నగరాల: పిల్లా సుజాత
యాత: పి.సుజాత
నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ

తూర్పు గోదావరి:

గాండ్ల: భవాణీ ప్రియ
పెరిక: పురుషోత్తం గంగాభవానీ
అగ్నికుల క్షత్రియ: భండన హరి
అయ్యారక: రాజేశ్వరం

పశ్చిమ గోదావరి:

సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి
శెట్టి బలిజ: తమ్మయ్య
అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న
అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు

కృష్ణా:

విశ్వ బ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్
గౌడ: మాడు శివరామకృష్ణ
వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్
భట్రాజు: గీతాంజలి దేవి

గుంటూరు:

షేక్: షేక్ యాసీన్
వడ్డెర: దేవల్లి రేవతి
కుమ్మరి శాలివాహన: పురుషోత్తం
కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ

ప్రకాశం:

చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్కుమార్
ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి
దేవాంగ: సురేంద్రబాబు
మేదర: లలిత నాంచారమ్మ

నెల్లూరు:

ముదిరాజ్: వెంకటనారాయణ
జంగం: ప్రసన్న
బొందిలి: కిషోర్ సింగ్
ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా

కర్నూలు:

వాల్మీకి బోయ: డా.మధుసూదన్
కుమి/కరికల భక్తుల: శారదమ్మ
వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్

అనంతపురం:

రజక కార్పొరేషన్: రంగన్న
కురుబ కార్పొరేషన్: కోటి సూర్యప్రకాశ్ బాబు
తొగట కార్పొరేషన్: గడ్డం సునీత
కుంచిటి వక్కలిగ: డా.నళిని

చిత్తూరు:

వన్యకుల క్షత్రియ: కె. వనిత
పాల ఎకరి: టి. మురళీధర్
ముదళియర్: తిరుపతూర్ గోవిందరాజు సురేష్
ఈడిగ: కె.శాంతి

కడప:

యాదవ: హరీష్ కుమార్
నాయిబ్రాహ్మణ: సిద్దవటం యానాదయ్య
పద్మశాలీ: విజయలక్ష్మి
నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్బి
సాగర ఉప్పర: గనుగపేట రమణమ్మ

Read more RELATED
Recommended to you

Latest news