వైసీపీలో ఆ సీనియర్ నేత ఇమడ లేకపోతున్నారా…?

-

ఏడాది క్రితం వరకూ టీడీపీలో కీలక నేత. కడప జిల్లాలో ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు కేంద్రమైన జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన నాయకుడు. అప్పట్లో YS కుటుంబాన్ని ఎదుర్కొని పోటీగా రాజకీయాలు చేసిన కుటుంబంగా రామసుబ్బారెడ్డి ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది.దీంతో రాజకీయ భవిష్యత్‌పై ఆలోచనలో పడ్డారట మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి.

రామసుబ్బారెడ్డికి 2004 నుంచి కాలం కలిసి రావడం లేదు. ఆ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి చేతిలో ఓటమి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఆయన్ని పరాజయమే పలకరించింది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో రామసుబ్బారెడ్డికి మళ్లీ ప్రాధాన్యం వచ్చింది. ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడమే కాదు.. ఏకంగా మంత్రి అయ్యారు. అప్పటి నుంచి రామసుబ్బారెడ్డి రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో వైసీపీలో చేరిపోయారు.

రామసుబ్బారెడ్డి అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో నిత్యం ఇబ్బందులే ఎదురవుతున్నాయని అనుచరుల దగ్గర ఆయన వాపోతున్నారట. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. ఫ్యాక్షన్‌ గడ్డలో కీలకంగా ఉన్న తనపై కొద్దిపాటి గౌరవం కూడా లేదా అని ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ ప్రశ్నిస్తున్నారట. సహనంగా ఉంటే దానిని చేతకానితనంగా భావిస్తే ఎలా అని నిలదీస్తున్నారట రామసుబ్బారెడ్డి. . ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ మారి తప్పు చేశానా అని పదే పదే ప్రశ్నించుకుంటున్నారట. ఇప్పుడిదే జిల్లా రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మరింది.

Read more RELATED
Recommended to you

Latest news