అగోరీని పెళ్లి చేసుకున్న అగోరా బాబా..వీడియో వైర‌ల్ ..!

పెళ్లిల్లు స్వ‌ర్గంలో నిశ్చియంచ‌బ‌డాయ‌ని అంటారు. కానీ వారి పెళ్లి మాత్రం స‌మాధుల్లో నిశ్చయించ‌బ‌డింది. ఆ ఇద్ద‌రూ అగోరాలు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. అంటే వారు తిరిగేది ఎక్కువ‌గా స‌మాధుల్లోనే కాబ‌ట్టి వారి వివాహం స‌మాధుల్లోనే నిశ్చయించ‌బ‌డింది. వివ‌రాల్లోకి వెళితే….. ప్ర‌ముఖ అఘోరా బాబా మ‌ణికంద‌న్ సోమ‌వారం వివాహం చేసుకున్నాడు. త‌న శిశ్యురాలు అయిన అఘోరినే ఆయ‌న పెళ్లి చేసుకున్నాడు.

aghori baba marriage video
aghori baba marriage video

మ‌ణికంద‌న్ కాశీలో అఘోరా శిక్ష‌ణ పొందాడు ఆ త‌ర‌వాత తిరుచ్చిలోని ప‌శ్చిమ బెంగాల్ లోని కోల్ క‌తా నివాసి అయిన త‌న శిష్యురాలు అయిన ప్రియాంక‌ను వివాహం చేసుకున్నాడు. ఇక వీరి వివాహం కూడా ఓ మృత‌దేహం వ‌ద్ద‌నే జ‌రిగింది. మృత దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తూనే అఘోరా దంప‌తులు వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అంతే కాకుండా ఇద్ద‌రు అఘోరాలు పెళ్లి చేసుకోవ‌డం ఇదే మొద‌టి సారి కాబ‌ట్టి ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక‌ ఈ అఘోరా జంట కాపురం ఎక్క‌డ పెడ‌తారా అని అంతా షాక్ అవుతున్నారు.