ఏపీలో దారుణం…విద్యార్థినిని చిత‌కబాదిన ప్రిన్సిప‌ల్..!

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వావిలిపల్లి పేట ఏపీ మోడల్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వై స్రవంతి అనే విద్యార్దినిని క‌ళాశాల‌ ప్రిన్సిపాల్ మార్తా తిలకం చిత‌క‌బాదారు. రెండు గంటల సేపు విద్యార్దిని ప్రిన్సిపాల్ రూమ్ లో బంధించారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొందూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

principal beats inter student
principal beats inter student

త‌మ‌కు న్యాయం కావాలంటూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇక తోటి విద్యార్థిని ప్రిన్సిపాల్ చిత‌క బాద‌డంతో మిగ‌తా విద్యార్థులు కూడా బ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇంటర్ చ‌దువుతున్న విద్యార్థినిని చిత‌క‌బాద‌డం ఏంట‌ని త‌ల్లిదండ్రులు ప్ర‌శ్నిస్తున్నారు. విద్యార్థి నేత‌లు కూడా ప్రిన్సిపాల్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.