కాంగ్రెస్ అగ్ర నేత అహ్మద్ పటేల్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కాంగ్రెస్ లో గాంధీ కుటుంబంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. 28 ఏళ్ళకే జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చిన్న వయసులోనే ఎంపీగా అడుగు పెట్టారు. కాంగ్రెస్ పతనం అంచున ఉన్న సమయంలో కూడా తన ఆలోచనలతో, వ్యూహాలతో పైకి తీసుకొచ్చారు. 1970 లలో ఇందిరా గాంధీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఎదుగుదల ప్రారంభమైంది.
అనేక మంది అనుభవజ్ఞులు కాంగ్రెస్ నుండి తప్పుకున్నా సరే ఆయన మాత్రం తప్పుకోలేదు. 77 లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా ఓడిపోయినా సరే ఆమె వెంటనే నడిచారు. అహ్మద్ పటేల్ దక్షిణ గుజరాత్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తూ, ఇందిరా గాంధీ పట్ల తన విధేయతను ప్రకటిస్తూ భరూచ్ సీటును గెలుచుకున్నారు. మరణించే వరకు కూడా సోనియా గాంధీకి అత్యంత సన్నిహిత నేత.