తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో ఇంజినీరింగ్ కోర్సుకి అనుమతి ఇచ్చిన AICTE..!

-

ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, ఆల్ ఇండియా కౌంసిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎనిమిది భారతీయ భాషల్లో కోర్సులకు అనుమతి ఇచ్చింది. వీటిలో తెలుగు కూడా ఇప్పుడు ఉంది. 2021-22 అకడమిక్ సెషన్ నుండి ఈ కోర్సులు మొదలవుతాయి.

మరి ఏ భాషలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూస్తే… హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ్, గుజరాతి, కన్నడ మరియు మలయాళం భాషలో కోర్సులు ఇప్పుడు ఉంటాయి. అయితే దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే… మోదీ ప్రభుత్వం మాతృభాష లో విద్యను అభ్యసించాలి అన్న నిర్ణయం మూలాన్ని ఈ ఫెసిలిటీ వచ్చింది.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండర్ లో దీన్ని తీసుకు రావడం జరిగింది. నవంబర్ 2020 లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రపోసల్ ని చెప్పింది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ని మాతృభాషలో కూడా తీసుకు రావాలని అప్పుడు అనడం జరిగింది.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా గ్రామాల్లో వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి బాగా సహాయపడుతుంది. అయితే దీన్ని తీసుకు రావడానికి మరొక ముఖ్య ఉద్దేశం ఉంది. అది ఏంటంటే..? మాతృభాష లో విద్యార్థులకు బోధించడం వల్ల వరల్డ్ ఫండమెంటల్స్ మరింత బాగా అర్థం చేసుకుంటారని నిజంగా ఇది బాగా ఉపయోగ పడుతుంది. అయితే త్వరలో ఇంజనీరింగ్ కోర్సుని మరో 11 భాషలలోకి కూడా తీసుకు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news