శుక్రవారం నాడు ఇలా పూజ చేస్తే ఆర్ధిక సమస్యలు ఉండవు..!

శుక్రవారం నాడు లక్ష్మీ దేవికి పూజ చేయడం చాలా మంచిది. ఆ రోజు కనుక పూజ చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి. ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగి పోతాయి. లక్ష్మీ దేవికి పూజ చేయడం వల్ల ధనం ఇంట్లో ఉంటుంది.

మీకు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. ఆ రోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పూజ చేసుకుని ఉపవాసం ఉండటం మంచిది. ఉపవాసం చేస్తే మంచిది లేదు అంటే చెయ్యకపోయినా పరవాలేదు. శుక్రవారం నాడు పూజ లో కొన్ని రకాలు ఉన్నాయి. వాటి కోసమే ఇప్పుడు మనం చూద్దాం…

మీ దగ్గర ఉండి డబ్బు త్వరగా ఖర్చు అయిపోతుంటుంటే అప్పుడు మీరు లక్ష్మీ దేవికి దీపం వెలిగించండి. అయితే ఈ దీపం ఆవు నెయ్యి తో వెలిగించడం మరీ మంచిది.

లక్ష్మీ దేవి పాదాల కింద ఒక రూపాయి కాసు పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక ధనవంతురాలికి ఇవ్వండి.

లక్ష్మి అష్టోత్తరం చదివి పూజ చేస్తే శుభం కలుగుతుంది.

మహా లక్ష్మి దేవికి ప్రతి శుక్రవారం నాడు హారతి ఇచ్చి హారతి పాట పాడండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి పరిష్కారం కనబడుతుంది.