భార్యతో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్న మనీష్ శర్మ.. తన భార్యతో గొడవ పడి ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజస్థాన్ లోని నాగౌర్ కు చెందిన మనీశ్.. ఎయిమ్స్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం తనకు తృప్తి అనే యువతితో పెళ్లయింది. ఆమె కూడా డాక్టర్. అయితే.. పెళ్లయినప్పటి నుంచి ఇద్దరూ తరుచూ గొడవ పడేవారని… ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అనుమానం ఉండేదని అపార్ట్ మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్ మెంట్ లో ఎయిమ్స్ లో మనీశ్ తో కలిసి పనిచేసే డాక్టర్లు కూడా ఉంటున్నారు. ప్రతి రోజు వీళ్లు గొడవ పడేవారని.. అలాగే మంగళవారం రాత్రి కూడా గొడవపడ్డారు. మనీశ్.. తృప్తిపై దాడి చేయబోయే సరికి ఆమెను పక్కింట్లోకి తీసుకెళ్లారు పొరుగు వాళ్లు. దీంతో కోపోద్రికుడైన మనీశ్.. వెంటనే బాల్కనీ నుంచి కిందికి దూకేశాడు. వెంటనే అపార్ట్ మెంట్ వాసులు అతడిని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించాడని డాక్టర్లు వెల్లడించారు.