ఓమైగాడ్.. క్షణం ఆలస్యమై ఉంటే.. వీడియో

-

Very Narrow Escape For 2 Men As Truck Crashes Over Them

క్షణం విలువ మనకు తెలియక పోవచ్చు. కానీ.. ఆ క్షణంలోనే ఎన్నో జీవితాలు తారుమారవుతాయి. ఎన్నో జరిగిపోతాయి. ప్రాణాలే గాల్లో కలిసిపోతాయి. కానీ.. వీళ్లు మాత్రం ఆ క్షణంలోనే చావును తప్పించుకున్నారు. అక్కడున్న వాళ్లు నమ్మలేకపోయారు వాళ్లు బతికారంటే. ఈ ఘటన సౌత్ చైనాలోని వుజౌ సిటీలో చోటు చేసుకున్నది.

ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద వెళ్తున్నారు. ఇంతలో ఎదురుగా ఇసుక లోడ్ తో ట్రక్ వస్తోంది. అది వేగంగా మృత్యుశకటంలా దూసుకొస్తున్నది. మూలమలుపు వద్ద ట్రక్ అదుపు తప్పింది. వీళ్లు ఆ ట్రక్ ను తప్పించబోయారు. ట్రక్ వీళ్ల మీద పడబోయింది. ట్రక్ లో ఉన్న ఇసుక అంతా వీళ్ల మీద పడటంతో వీళ్లు అవతల పడిపోయారు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news