ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్…

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో పాకిస్థాన్ నగరం లాహోర్ నిలిచింది. గురువారం వెల్లడించిన నివేదిక ప్రకారం లాహెర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియాలోని ఢిల్లీ, కోల్ కతాలు వరసగా మూడు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మనకు లాగే పాకిస్థాన్ లోని పంజాబ్ లో కూడా రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టడంతో లాహోర్ లో కాలుష్యం పెరుగుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన గాలి నాణ్యత పరిశీలన సంస్థ ఐక్యూఎయిర్‌ ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించింది. వాయునాణ్యత సూచీ(ఏక్యూఐ)లో లాహోర్‌కు ఏకంగా 233 పాయింట్లు రాగా.. ఢిల్లీకి 216 పాయింట్లు వచ్చాయని సంస్థ పేర్కొంది.

అత్యంత కాలుష్య నగరాల జాబితాను పరిశీలిస్తే లాహోర్ మొదటిస్థానంలో నిలువగా… మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్, ఇండియా క్యాపిటల్ ఢిల్లీ మూడో స్థానంలో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నాలుగో స్థానంలో, కోల్ కతా ఐదో స్థానంలో, కరాచీ ఆరోస్థానంలో,  నేపాల్ రాజధాని ఖాట్మాండు ఏడోస్థానంలో, చైనాలోని వూహాన్ ఎనిమిదో స్థానంలో, ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. 31 స్థానంలో భారత వాణిజ్య రాజధాని ముంబై నిలిచాయి.