ఎయిర్‌పార్క్ కాలనీలు.. ఇంటికో విమానం..!

-

ప్రస్తుతకాలంలో మీరు బాగా చూసినట్లయితే ఒక ప్రాంతంలో కొన్ని విల్లాలు, ఇళ్లు ఒకే స్టైల్‌లో తయారు చేసి అమ్మడం కనిపిస్తుంటాయి. హైదరాబాద్ ప్రాంతంలోనూ అలాంటి కాలనీ ఇళ్లను పరిశీలించే ఉంటారు. ఒక ప్రత్యేకమైన స్థలంలో అన్ని ఇళ్లను ఒకే స్టైల్‌లో నిర్మించి ఇవ్వడం. దీనిని గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు అంటుంటారు. ఒకేలా ఉండే వందలాది ఇళ్లు, ఇంటికో కారు, పెద్ద బంగ్లా, కారు గ్యారేజీ వంటి సౌకర్యాలను కల్పిస్తుంటాయి. అయితే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలో కొన్ని ప్రాంతాల్లో ధనవంతులు కూడా నివసిస్తుంటారు. అక్కడ ఇంటికో కారుతోపాటు విమానం కూడా ఉంటుంది.

ఎయిర్ పార్క్
ఎయిర్ పార్క్

ఈ కమ్యూనిటీకి చెందిన ఇళ్లను ఎయిర్‌పార్క్ కాలనీగా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎయిర్‌పార్క్ కాలనీలు దాదాపుగా 650 ఉన్నాయని సమాచారం. ఈ కాలనీలో కారుతోపాటు విమానాలు పార్క్ చేయడానికి ప్రతి ఇంటి ముందు భారీ గ్యారేజీ ఉంటుంది. స్థానికులు, బంధువులు ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఎవరైనా రావాలన్నా.. విమానంలోనే వెళ్లాల్సిందే.

ఈ ఎయిర్‌పార్క్ కాలనీలో చెప్పుకోదగ్గవి చాలానే ఉన్నాయి. వీటిలో ఒకటి.. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కామెరాన్ పార్క్. తాజాగా ఈ ప్రాంతంలోని ఇళ్లను అమ్మకానికి పెట్టడంతో ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒకప్పుడు ఈ కామెరాన్ పార్క్ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఎయిర్ పోర్టును నిర్మించింది. కానీ, సమస్యలు తలెత్తడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది. ఎయిర్ పోర్టు నిర్మాణం జరగదని తెలిసి ఇక్కడున్న 61 ఎకరాల్లో ఇళ్ల నిర్మించి అమ్మకాలు చేపట్టింది. సంపన్నులు, పైలట్లు, విమానం నడిపించాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ప్రాంతంలో ఇళ్లను కొనుగోలు చేయవచ్చు.

వందకుపైగా ఇళ్లు ఉన్న ఈ ప్రాంతంలో జనరల్ ఏవియేషన్‌కు అనుమతి ఉంది. చిన్నపాటి చార్టెడ్ ఫైట్స్ సొంతంగా నడిపించుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ఇక్కడి సంపన్నులు సొంతంగా చిన్న విమానాలను కొనుగోలు చేసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రధాన రన్‌వేకి వెళ్లడానికి చిన్న రన్ వేలు, విమానాలు ఢీ కొనకుండా 100 అడుగుల వెడల్పుతో రోడ్లు ఏర్పరచుకున్నారు. 98 శాతం కుటుంబాలు విమానంలోనే ప్రయాణిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news