ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. జాబ్ ఆఫర్ లెటర్స్ ని నమ్మచ్చా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త వచ్చింది. అయితే అందులో ఏముంది అనేది చూస్తే.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు అని కొంత మంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరు తో ఫేక్ ఆఫర్ లెటర్స్ ని ఇస్తూ నిరుద్యోగులకి మోసం చేస్తున్నారు.

Image

ఏకంగా నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ని ఇస్తూ.. మోసగాళ్లు మోసం చేస్తున్నారు. అయితే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపై స్పందించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరు తో వస్తున్న ఈ మెయిల్స్ ని నమ్మద్దు అని చెప్పింది. అలానే డబ్బులు కట్టమని కూడా అంటున్నారని… ఇటువంటి వాటికి దూరంగా ఉండమని చెప్పింది.

అయితే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈమెయిల్స్ ని పంపించట్లేదు. మోసగాళ్లు ఈ మెయిల్స్ ని పంపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఫేక్ వాటితో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనవసరంగా మోసపోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news