దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సంచలనాలతో దూసుకుపోతోంది. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే దేశీయ టెలికం మార్కెట్లో భారీ షేర్ సొంతం చేసుకున్న జియో దెబ్బకు దేశీయ టెలికం కంపెనీలు అన్నీ విలీనం అవ్వడమో లేదా మూతపడడమో జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జియో ఫైబర్ నెట్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే అదిరిపోయే ఆఫర్లు కూడా ప్రకటించింది.
రిలయన్స్ జియో ఫైబర్ ప్లాన్స్‌ను ప్రకటించిన క్రమంలో ఎయిర్‌టెల్ సైతం హైస్పీడ్ సేవలతో కూడిన ప్లాన్ ఎక్ట్స్రీమ్ ఫైబర్ పేరుతో ముందుకొచ్చింది. వన్ జీబీపీఎస్ నెట్‌వర్క్ వేగంతో ఎయిర్‌టెల్ హోం బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ తరహాలోనే ఎయిర్‌టెల్ కూడా ప్లాన్ రేటుతో పాటు బెనిఫిట్స్‌ను కూడా వివరించింది.
ఎయిర్‌టెల్ ఎక్ట్స్రీమ్ మల్టీమీడియా స్మార్ట్ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఈ ఫైబర్ సర్వీస్‌ను లాంఛ్ చేసింది. ఎక్ట్స్రీమ్ ఫైబర్ ప్లాన్‌కు వినియోగదారులు నెలకు రూ 3,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరతో వన్ జీబీపీఎస్ నెట్‌వర్క్ స్పీడ్‌తో సేవలు లభిస్తాయి. నెలరోజులకు వర్తించే ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌కు వర్తించే బెనిఫిట్లు అందుబాటులోకి వస్తాయి.
ఇక ఈ ప్లాన్ వాడే సబ్‌స్క్రైబర్లు ఆరు నెలల వ్యవధిలో 1000 జీబీ డేటాను అదనంగా పొందుతారని పేర్కొంది. ఎక్స్ట్రీమ్ ఫైబర్ ల్యాండ్ లైన్ కనెక్షన్‌తో అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే జియో దెబ్బతో దేశీయ మార్కెట్లో కుదేలవుతోన్న ఎయిర్‌టెల్ మరి ఫైబర్ నెట్ రంగంలో ఏం చేస్తుందో ? చూడాలి.