కరోనా నేపథ్యంలో కస్టమర్స్ కోసం ఎయిర్‌టెల్ కొత్త సేవలు…

-

ఎయిర్‌టెల్ తమ కస్టమర్స్ కోసం కొత్త సేవలు తీసుకు వచ్చింది. దీని వలన ఎయిర్‌టెల్ కస్టమర్స్ కి బెనిఫిట్స్ కలగనున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… కరోనా వైరస్ సమయంలో కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది ఎయిర్టెల్.

కోవిడ్ సపోర్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని వలన ఈ కరోనా కష్ట కాలం లో ఎయిర్‌టెల్ కస్టమర్లకు రిలీఫ్ గా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… మెడిసిన్స్, ఆక్సిజన్, ప్లాస్మ డోనర్స్, అంబులెన్స్, హాస్పిటల్ బెడ్స్ (రెగ్యులర్, 02, ఐసీయూ), టెస్టింగ్ సెంటర్స్ వంటి వాటికి సంబంధించిన అప్‌డేటెడ్ సమాచారంని ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ లో పొందొచ్చు.

దీని వలన కస్టమర్స్ కి మంచి లాభాలు కలుగుతాయి. కొన్ని క్లిక్స్‌తోనే సులభంగానే కోవిడ్ 19 సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి సేవలు పొందొచ్చు. అంతే కాదండి ఈ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ స్లాట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఎయిర్‌టెల్ కస్టమర్లు లేటెస్ట్ వెర్షన్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ ప్రయోజనాలని అన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news