కాకరకాయ చేదుగా ఉన్న దానివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

-

కాకరకాయ తినడానికి చాలా మంది ఇష్టపడరు. చేదుగా ఉండడం వల్ల తమ ఆహారంలో భాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ కాకరకాయ చేసే మేలు గురించి మీకు తెలిస్తే దాన్ని వదిలిపెట్టరు. ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకి, జుట్టు సంరక్షణకి కాకరకాయ చేసే మేలు గురించి ఈ రోజే తెలుసుకోండి. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, కె పుష్కలంగా ఉంటాయి. యాంటీబాక్టీరియల్ లక్షణాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

యవ్వనంగా కనిపించడానికి

యవ్వనంగా కనిపించడానికి వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో కాకరకాయ మేలు చేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి చర్మానికి ఆరోగ్యం అందుతుంది.

మొటిమలు రాకుండా నివారిస్తుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. రక్తంలోని మలినాలని బయటకి పంపివేస్తాయి. కాబట్టి చర్మంపై మొటిమలు ఏర్పడకుండా ఉంటుంది.

చికాకు దూరం చేస్తుంది

కాకరకాయ రసంలో కొద్దిగా నారింజ రసాన్ని కలుపుకుని ముఖానికి మర్దన చేయండి. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. దానివల్ల చర్మంపై కలిగే చికాకు దూరం అవుతుంది.

మెరిసే జుట్టు కోసం

అరకప్పు కాకరకాయ రసాన్ని తీసుకుని అందులో ఐదు స్పూన్ల పెరుగుని కలపండి. ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రంగా నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చుండ్రును పోగొడుతుంది

చుండ్రుతో బాధపడుతుంటే కాకరకాయ రసాన్ని కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా నీరు కలుపుకుని తలస్నానం చేస్తే చుండ్రుని నివారించవచ్చు.

జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది.

జుట్టు పొడిబారుతుంటే కాకరకాయ రసాన్ని తీసుకుని దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి. తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తుంటే పొడిబారిన జుట్టు తేమగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news