ముంబయి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను పడగొట్టి రికార్డులను తిరగరాశాడు. 47.5 ఓవర్లలో 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లను పడగొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జిమ్ లాకర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150), శుభుమన్ గిల్ (44), అక్సర్ పటేల్ (50) పరుగులతో రాణించారు. ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అశ్విన్, ఉమేశ్ యాదవ్‌లు డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. కడపటి వార్తల సమయానికి ఆరు పరుగులకు వికెట్ నష్టపోకుండా ఆడుతున్నది.