బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “అఖండ” సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్…!

-

బాలయ్య నటించిన అఖండ సినిమా బంపర్‌ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో… చిత్ర పరిశ్రమకు మళ్లీ ఊపు వచ్చింది. డిసెంబర్‌ 2 వ తేదీన విడుదల అయిన అఖండ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసేలా… రికార్డులను బద్దలు కొడుతోంది. అయితే… ఈ అఖండ సినిమా ఎప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతుందోనని చాలా మంది ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. అఖండ తెలుగు చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందని.. ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా… హాట్‌ స్టార్‌ రిప్లై కూడా ఇచ్చింది. 2022 జనవరి 21 వ తేదీన ప్రీమియర్‌ లో స్ట్రీమ్‌ కానుందని చెప్పింది హాట్‌ స్టార్‌. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే.. జనవరి 21 వ తేదీన అఖండ ఓటీటీ రిలీజ్‌ కానున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక అటు పుష్ప సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో రేపు రాత్రి 8 గంటలకు విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version