సెబీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెక్యూరిటీస్ మార్కెట్ ఆపరేషన్స్ (SMO), లా, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. సెబీ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద అభ్యర్థులు మొదట ఒక సంవత్సరం పాటు నియమితులవుతారు. తరవాత ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ వుంది.

సెబీ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 జనవరి 2022. ఇక అర్హత విషయంలో వస్తే.. అభ్యర్థులు మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా CA/CMAలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి లేదా CFAలోని మూడు స్థాయిల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రొఫెషనల్ (లా) అభ్యర్థులకు కనీసం 60% మార్కులతో న్యాయశాస్త్రంలో డిగ్రీతోపాటు ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసుండాలి. ఇక వయస్సు విషయంలోకి వస్తే.. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం రెండు ఇంటర్వ్యూలు ఉంటాయి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version