AkhandaTitleSong : అఖండ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. భం భం అఖండ…!

-

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటన, డైలాగ్ లతో అందరినీ ఆకట్టుకుంటాడు బాలకృష్ణ. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే బాలయ్య అఖండ సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ను క్రేజీ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కుస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ ప్రోమో ను విడుదల చేసిన అఖండ టీం… తాజాగా ఫుల్ సాంగ్ ను విడుదల చేసింది. ఇందులో నందమూరి బాలయ్య చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించారు. . శూలం పట్టుకుని… తలకు విబూదీ పెట్టుకుని… విధ్వంస కరంగా కనిపించారు బాలయ్య.  అలాగే ఈ సాంగ్ లిరిక్స్ కూడా రోమాల్ నిలుచునేల ఉన్నాయి. మొత్తానికి ఈ సాంగ్ తో బాలయ్య ఫాన్స్ కు ఫుల్ మీల్స్ దొరికిందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news