నిరసన తెలపడం కూడా.. రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? : నారా లోకేష్

-

వైసీపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. చంద్ర‌బాబు పాల‌న‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్ళాలని జగన్ అన్నారని.. జగన్ పాలనలో అవే ధరలు తెలుసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్ర‌మైనా వెళ్లేందుకు మేము సిద్ధం, జగన్ మీరు సిద్ధ‌మా..? అని సవాల్ విసిరారు. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని నిలదీశారు నారా లోకేష్.

ys jagan on nara lokesh

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జులా..? అని ప్రశ్నించారు. తలలు పగిలేలా కొట్టించడం ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమనీ ఫైర్ ఆయారు. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా..? అని అగ్రహించారు.

గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని.. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. విద్యార్థి ఉద్యమాలు అణిచేయ్యాలని చూసిన ఎంతటి నియతైనా నేలకొరగడం ఖాయమన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.. ఇచ్చిన జీవోలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news