AkhandaTrailerRoar : బాలయ్య “అఖండ” ట్రైలర్ ముహూర్తం ఫిక్స్..

-

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హిట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శ్రీకాంత్, జగపతి బాబు అలాగే పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరియాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ముహూర్తాన్ని ఖరారు చేస్తూ ఓ పోస్టరును వదిలింది అఖండ టీం. నవంబర్ 14 వ తేదీన రాత్రి 7.09 గంటలకు అఖండ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది చిత్రబృందం.

ఈ మేరకు బాలయ్య ఉగ్రరూపంలో ఉన్న పోస్టర్ను వదిలింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో నందమూరి బాలయ్య త్రిశూలం పట్టుకొని.. ఒంటికాలిపై విలయ తాండవం చేస్తున్నారు. ఇక ఈ తాజా అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news