త‌ను భార‌మై.. త‌న వారికి దూర‌మై.. అఖిల ప్రియ రాజ‌కీయాలు..!

-

రాజ‌కీయాల్లో ఎంత దూకుడు ఉండాలో.. అంతే నినాదం.. నిల‌క‌డ ఉండాలి. ఆచితూచి అడుగులు వేయా లి. ఎవ‌రు.. మ‌న వారు.. ఎవ‌రు ప‌రాయివారు.. అనే ముందు చూపు ముఖ్యంగా ఉండాలి. అస‌లు రాజ‌కీ యాల్లో ఉన్నవారు.. వ్యూహాల‌కు వ్యూహాలు వేయ‌డం, ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించ‌డం అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎదురయ్యే ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణే! అయితే, ఆయా విష‌యాల్లో ఆచి తూచి అడుగులు వేసిన వారు.. గెలుపు గుర్రం ఎక్కారు. లేద‌న్న‌వారు.. మెరుపుల్లా అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే మాయ‌మ‌య్యారు. ఇలాంటి వారి జాబితాలో అత్యంత వేగంగా చేరిపోయిన రాజ‌కీయ నాయ‌కురాలు.. క‌ర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి కుమార్తె.. భూమా అఖిల ప్రియ‌.

2014 ఎన్నిక‌ల్లో అనూహ్య‌రీతిలో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన అఖిల ప్రియ‌.. ఆదిలో వైసీపీ నాయ‌కురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. త‌ల్లి అనూహ్య మ‌ర‌ణంతో ఆమె ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించా రు. త‌ర్వాత త‌న తండ్రి నాగిరెడ్డికి చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఆశ చూప‌డంతో తండ్రీకూతుళ్లు ఇద్ద‌రూ కూడా పార్టీ మారి.. బాబుకు జైకొట్టారు. ఇది జ‌రిగిన కొన్నాళ్ల‌కే నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయ‌న‌కు ద‌క్కాల్సిన మంత్రి ప‌ద‌విని.. చంద్ర‌బాబు.. ఆయ‌న కుమార్తెకు ఇచ్చారు. 2017లో మంత్రి అయిన అఖిల ప్రియ‌.. పాల‌న ప‌రంగా దూకుడు అందుకోలేక పోయినా.. క‌ర్నూలు జిల్లాలో మాత్రం పైచే యి సాధించేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా శ‌త్రువుల‌ను పెంచుకున్నారు. త‌న కుటుంబానికి మిత్రుడు.. త‌న తండ్రికి రైట్ హ్యాండ్ వంటి ఏవీ సుబ్బారెడ్డితో శ‌తృత్వం పెంచుకున్నారు. దీంతో రాజ‌కీయంగా అఖిల ప్రియ త‌న ‌కు తాను మంచి మార్కులు వేసుకున్నాన‌ని అనుకున్నా.. అత్యంత త‌క్కువ కాలంలో పార్టీకి భారంగా మా రారు. రోజుకో వివాదంతో ఆమె పార్టీని బ‌జారు కీడ్చార‌ని జిల్లాకు చెందిన సీనియ‌ర్లు ఫిర్యాదులు చేశారు. ఇదిలావుంటే, ఇప్పుడు మ‌రింత‌గా ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్ర‌మంలో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఆమెకు అండ‌గా నిలిచేందుకు ముందుకు రాలేదు.

దీంతో మాజీ మంత్రి అయిన త‌న‌కు పార్టీ అండ‌గా నిల‌వ‌డం లేద‌నే వాద‌న అఖిల ప్రియ అనుచ‌ర వ‌ర్గం నుంచి వినిపిస్తోంది. వాస్త‌వానికి త‌న హ‌ద్దులు ఏంటో త‌ను తెలుసుకుని ఉంటే.. అంద‌రినీ క‌లుపుకొని పోయి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి ఉండేది కాదుక‌దా? అన్న‌ది ప్ర‌శ్న‌. మొత్తంగా చూస్తే.. దాదాపు మూడు ద‌శాబ్దాల‌పాటు క‌ష్ట‌ప‌డి.. ఎండ‌న‌క‌వాన‌న‌క‌.. ప్ర‌జ‌ల్లో తిరిగి.. భూమా నాగిరెడ్డి సంపాయించుకున్న ప‌రువు నేడు గాలికి రెప‌రెప‌లాడుతోంద‌ని సీనియ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటు పార్టీకి భార‌మై.. త‌న వారికి దూర‌మై. అఖిల ప్రియ సాధించింది శూన్య‌మ‌ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news